ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి
కోటబొమ్మాళి: ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న ఆశావర్కర్లు డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని టెక్కలి నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల ఆశావర్కర్లు కోరారు. రాష్ట్ర ఆశా వర్కర్ల యూనియన్ పిలుపు మేరకు మంగళవారం మండలం నిమ్మాడలోని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయన ఓఎస్ఓ రామక్రిష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు ఎందుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినత పత్రం అందజేశామని వారు తెలిపారు. ఆశావర్కర్లుకు వేతనాలు పెంచాలని, అన్ని రకాల ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని, కనీస వేతనాలు చెల్లించాలని, పర్మినెంట్ చేయాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలని, ఆశా వర్కర్లు గత ఏడు సంవత్సరాలు వేతనాలు పెంచాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంతబొమ్మాళి, టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన ఆశావర్కర్లు సత్యవతి, చంద్రకళ, పాల్గొన్నారు.