BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

కరెంట్‌ చార్జీలు పెంచితే ఖబడ్దార్‌:బండారి శ్రీనివాస్ గౌడ్

Select Suryaa Now
కరెంట్‌ చార్జీలు పెంచితే ఖబడ్దార్‌:బండారి శ్రీనివాస్ గౌడ్

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(అక్టోబర్, 06): ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ చార్జీల పెంపుతో వారిపై మరింత భారం మోపడం సరికాదని ఘట్‌కేసర్ మండల మాజీ ఎంపీపీ, డివిజన్ బీఆర్‌ఎస్
అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గృహ వినియోగదారులు, రైతులు, చిన్న వ్యాపారులు, చిరు పరిశ్రమలపై పెంపు ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలోని ఆర్థిక సమస్యలకు వినియోగదారులపై భారం మోపడం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేపడతామని బండారి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

గుర్రం రమేష్, ఘట్కేసర్ రిపోర్టర్, మేడ్చల్ జిల్లా.