ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం
ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం
పాపన్నపేట ; ;ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని మంగళవారం గవర్నర్ ప్రెస్ సెక్రటరీ దశరథం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఆలయానికి చేరుకున్న గవర్నర్ ప్రెస్ సెక్రటరీ దశరథానికి ఆలయ ఈఓ మఠం వీరేశం, దేవస్థానం సిబ్బంది, ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏడుపాయల వన దుర్గామాత ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాశస్త్యం, పూజా కార్యక్రమాల వివరాలను గవర్నర్ ప్రెస్ సెక్రటరీ దశరథానికి వివరించారు. అనంతరం ఆయన ఆలయ పరిసరాలను పరిశీలించి, అమ్మవారిని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రామచందర్ రాజు, ఏపీఆర్ఓ బాబు రావు, ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.