అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ.
సూర్య అద్దంకి.
స్థానిక సంస్థలైన మున్సిపాలిటీ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అద్దంకి పట్టణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు భారీ ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మన్నం త్రిమూర్తులు తెలిపారు. అభ్యర్థులు ఓటుకు నోటు, మద్యం, మత్తు పదార్థాలు మరియు బహుమతులతో ఓటర్లను ఆకర్షించే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను పూర్తిగా నివారించాలని ఈ ర్యాలీ ద్వారా కోరనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా, సక్రమమైన పద్ధతిలో జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు