కడప పెద్ద దర్గా ఉర్సుకు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన దర్గా పెద్దలు
కడప నగరంలోని అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును దర్గా పెద్దలు ఆహ్వానించారు. అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి కేఎస్ఎస్ అరీఫుల్లా హుస్సేనీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆహ్వానపత్రిక అందించారు. ఈనెల 24 నుంచి 29 వరకూ జరిగే ఈ ఉత్సవాలకు హాజరవ్వాలని కోరారు. ఉర్సుఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను గురించి సీఎం ఆరా తీశారు. సీఎంను కలిసిన వారిలో దర్గా మేనేజర్ ఎమ్‌డీ అలీఖాన్, సయ్యద్ గౌస్, అమీర్ బాషా, తదితరులు ఉన్నారు.
కడప క్రైమ్ రిపోర్టర్, వేణు.