BREAKING
స్వర్ణ గిరిలో కలుశ పంచామృత అభిషేకం* క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘాతో అడుగులు వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన

భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి

Select Suryaa Now
భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి
సూర్య పెద్దపల్లి ప్రతినిధి ;జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణలో పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించి, ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్‌ బి. శ్రీరాములుతో కలిసి అటవీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ధర్మారం మండలం కానంపల్లి చెరువు భూ సేకరణను వేగవంతం చేయాలని, పెండింగ్‌ అంశాలను శాఖల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులతో చర్చలు జరిపి, వారి సమస్యలను తెలుసుకుని పరస్పర అవగాహనతో పరిష్కరించాలని ఆదేశించారు.అభివృద్ధి పనులకు రైతులు సహకరించాలని కోరిన కలెక్టర్‌ భూములు కోల్పోతున్న వారికి చట్టం, నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ బి. గంగయ్య, తహసీల్దార్‌ రాజయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.