BREAKING
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పై ఎన్ డి పి ఎస్ యాక్ట్ నిర్భంద ఉత్తర్వులు ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం తొంబై శాతం సబ్సిడీ తో స్ప్రింక్లర్స్ పంపిణీ స్వర్ణ గిరిలో కలుశ పంచామృత అభిషేకం* క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘాతో అడుగులు వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం…

కుమారుడి జ్ఞాపకార్థం బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం

Select Suryaa Now
కుమారుడి జ్ఞాపకార్థం బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం
సూర్య, వీణవంక:ప్రగతినగర్‌లోని శ్రీ వేంకటేశ్వర బధిరుల పాఠశాలలో పూర్వ విద్యార్థి నలుబాల సంజయ్ కుమార్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నలుబాల శ్రీనివాస్, వనిత దంపతుల కుమారుడైన సంజయ్ కుమార్.. ఇదే పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇటీవల అనారోగ్యంతో సెప్టెంబర్ 10న ఆయన మృతి చెందాడు. ​అక్టోబర్ 5న సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాఠశాలకు విచ్చేసి విద్యార్థులకు ప్లేట్లు, పెన్నులు పంపిణీ చేశారు. తమ కుమారుడు చదువుకున్న పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా అతని జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు దంపతులు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ నర్సమ్మ, పద్మనాభం, పాఠశాల సిబ్బంది కళ, వెంకట్ లక్ష్మి, రమణయ్య, శోభారాణి, చారి, పలువురు పూర్వ విద్యార్థులతో పాటు సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.