BREAKING
వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!

సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం

Select Suryaa Now
సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం

బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అంగన్వాడీ ఉత్సవం
సంగం మేజర్ న్యూస్ :   సంగం మండలం సిద్ధిపురం గ్రామంలో బీజేపీ, టీడీపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు విద్యాబోధనతో పాటు పోషకాహారం, ప్రాథమిక సంరక్షణ సేవలను అందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది సేవలను గుర్తించి గౌరవించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, తల్లులు, మహిళలకు అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
అంగన్వాడీ సిబ్బంది సీహెచ్. లక్ష్మమ్మ, సుభాషిణి, పి. సుబ్బలక్ష్మి, అమూల్యలను శాలువాలతో సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంగం మండల బీజేపీ నాయకులు మనోహర్ రెడ్డి, కాటుబోయినా నరేంద్ర యాదవ్, టీడీపీ నాయకులు, అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ నాయకులు సూరా కృష్ణారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.