2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్
సంతనూతలపాడు, మేజర్ న్యూస్ :
గత రెండున్నర సంవత్సరాల కాలంలో సంతనూతలపాడు నియోజకవర్గంలో పేద వర్గాలకు వైద్యం నిమిత్తం 2450 మంది లబ్ధిదారులకు రూ 18 కోట్ల 83 లక్షల మేరకు సీఎం. రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసినట్టు సంతనూతలపాడు శాసనసభ్యులు బి .ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్దగల బృందావనం ఫంక్షన్ హాలు నందు మంగళవారం ఏర్పాటు చేసిన సీ.ఎం.ఆర్.ఎఫ్. మహోత్సవ వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అనంతరం ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు అధ్యక్షత వహించారు. మొదట ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో పేద వర్గాలకు వైద్యం నిమిత్తం పార్టీలకతీతంగా సీఎం. రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే విజయ్ కుమార్ వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న పేదలకు వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సహాయ నిధి కింద నిధులు కేటాయించడం ఒక వరమని ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి, కుటుంబాలకు తన శక్తి మేరకు సీఎం .రిలీఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. గత రెండున్నర సంవత్సరాలు కాలంలో సంతనూతలపాడు నియోజకవర్గంలో సుమారు 110 కోట్ల రూపాయలు వ్యయం తో పలు రంగాలను అభివృద్ధి పరిచినట్టు ఆయన తెలిపారు. 2019వ సంవత్సరంలో తాను తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓటమి చెందానన్నారు.. కాగా 2024వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 30 వేల ఓట్లు కు పైగా మెజార్టీతో కూటమి నేతలతోపాటు అన్ని వర్గాల మద్దతుతో గెలిచానన్నారు. ఇందులో భాగంగా పేద వర్గాలకు వైద్య సహాయం అందించేందుకు మానవతా దృక్పథంతో తాను వారికి అండగా ఈ సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేశానన్నారు.
దీనివల్ల రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆయా వర్గాల మద్దతు ద్వారా మెజార్టీ 40 వేలకు పెరిగేందుకు కృషి చేస్తున్నానన్నారు. నియోజవర్గంలో అభివృద్ధి సంక్షేమం ముందంజలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. నియోజవర్గంలో రాబోయే మున్సిపల్, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో కూటమి తరఫున అందరు ఐక్యంగా కూటమి నేతలను గెలిపించాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ కోరారు. అనంతరం ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి అడకా స్వాములు, రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమైక్య అధ్యక్షులు మండవ జయంత్ బాబు, నియోజకవర్గ టిడిపి నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ సమన్వయకర్త కందుకూరి బాబు, నాలుగు మండలాల టిడిపి పార్టీ అధ్యక్షులు బాపట్ల టిడిపి అధికార ప్రతినిధి తన్నీరు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ రంప తోటి.అంకారావు తదితరులు పాల్గొన్నారు.