BREAKING
కడప పెద్ద దర్గా ఉర్సుకు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన దర్గా పెద్దలు గిరిజనులకు న్యాయం చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించను రెడ్‌క్రాస్ డైరెక్టర్‌గా* కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి స్వచ్ఛ పార్వతీపురం – మన్యం మర్యాద సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

చుంచుపల్లి తండా వాసి మృతి.. .హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..?

Select Suryaa Now
చుంచుపల్లి తండా వాసి మృతి..   .హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..?

చుంచుపల్లి తండా వాసి మృతి.. 

.హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..?

చుంచుపల్లి,సూర్య (మేజర్ న్యూస్) మండలంలోని చుంచుపల్లి తండాకు చెందిన ధరావత్ హరికృష్ణ (37) అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలపరకారం.. మృతుడు ఆదివారం అర్ధరాత్రి నాడు హౌసింగ్ బోర్డు నుంచి చుంచుపల్లి తండాకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందినట్లు  తెలిపారు. ప్రమాద సమయంలో హరికృష్ణ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అయితే రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న హరికృష్ణ ప్రమాదానికి గురై మృతి చెందడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా దాడి చేసి అనంతరం ప్రమాదంగా చిత్రీకరించి ఉండొచ్చన్న అనుమానాలను మృతుడి బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు.

మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.