సహజ రంగులతో జీవనోపాధికి కొత్త అవకాశాలు చత్రపతి శివాజీ ప్రభుత్వ కళాశాలలో జాతీయ సదస్సు
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్జంగారెడ్డిగూడెం చత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్రం, వాణిజ్యశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో “కలరింగ్ లైవ్లీహుడ్స్” అంశంపై జాతీయ సదస్సు. ప్రిన్సిపాల్ డా. ఎన్. ప్రసాద్‌బాబు అధ్యక్షతన మంగళవారం జరిగింది. పలువురు నిపుణులు సహజ రంగులు, పర్యావరణ పరిరక్షణ, స్థానిక వనరులతో ఉపాధి అవకాశాలపై ప్రసంగించారు.రీజినల్ జాయింట్ డైరెక్టర్ డా. పి.వి. కృష్ణాజీ మాట్లాడుతూ స్థానిక వనరులను వినియోగించుకుంటూ పర్యావరణహిత వ్యాపారాలను ప్రోత్సహించాలని అన్నారు. ఐఐటీ తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సంయుక్త భూపతిరాజు మాట్లాడుతూ చెట్లు, పువ్వుల నుంచి సహజ రంగులను తయారు చేసి రసాయనిక రంగుల వినియోగాన్ని తగ్గించాలన్నారు డా. పి.ఏ. నాయుడు మాట్లాడుతూ మహిళలు, గ్రామీణ చేతివృత్తిదారులు, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా వ్యాపారాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రోగ్రాం కన్వీనర్ బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ సహజ రంగులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉందని, యువత ఈ రంగంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు.ప్రిన్సిపాల్ డా. ఎన్. ప్రసాద్‌బాబు మాట్లాడుతూ సహజ రంగుల వినియోగంతో పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ మర్రి వెంకటేశ్వరరావు, డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ మొగళ్ళపు వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం కెవి రమణారావు