BREAKING
ఆరోగ్య కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి ప్రజా ఉద్యమకారుడు నాగభూషణం వర్ధంతి సభ హైదరాబాద్ మాజీ మేయర్ ఆలంపల్లి పోచయ్య మృతి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ‘పతి పత్ని ఔర్ పంగా’, ‘హసల్ 5’ సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణనష్టం లేదని వెల్లడించిన యూనిట్! ఇందుగుపల్లిలో 725 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి స్వచ్ఛాంధ్ర అవార్డు బి.గాయత్రి సేవా నిరతికి సత్కారం కేబీసీ షూటింగ్ బిజీలో నిద్రపోవడానికే సమయం దొరకట్లేదు.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి సంజయ్ దత్‌ వ్యాఖ్యలపై వివాదం.. నటుడికి మద్దతుగా నిలిచిన శేఖర్ సుమన్! ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి సమావేశం: గురుకుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1 లక్ష విరాళం ప్రజా సేవలో యువ రాజకీయం: - సర్పంచ్‌లుగా సత్తా చాటుతున్న యువతరం

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌కు తాడువాయి విద్యార్థులు

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌కు తాడువాయి విద్యార్థులు

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్దేవరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 1, 3 తేదీల్లో నిర్వహించిన అండర్‌-14, అండర్‌-17 ఫుట్‌బాల్‌ పోటీల్లో మండలంలోని తాడువాయి జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి స్టేట్‌ లెవెల్‌ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు.అండర్‌-14 బాలికల విభాగంలో బి. మైథిలి, ఎన్. హాసిని, బాలుర విభాగంలో జె. మణిశంకర్‌ ఎంపికయ్యారు. అండర్‌-17 బాలికల విభాగంలో జై. కీర్తన, బాలుర విభాగంలో కే. కార్తీక్‌, ఆర్. కార్తీక్‌ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ సిబ్బంది, ఎస్‌ఎంసీ చైర్మన్‌, గ్రామ పెద్దలు, దాతలు అభినందించారు.

 

 కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం