బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నడిపెల్లి విజిత్ కుమార్
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :
లక్షెట్టిపేట మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామ మాజీ సర్పంచ్ రాగుల రాజేశం ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ పాత కొమ్ముగూడెం గ్రామంలోని రాజేశం నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేశం మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజేశం కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.