ప్రజా సేవలో యువ రాజకీయం: - సర్పంచ్‌లుగా సత్తా చాటుతున్న యువతరం
ప్రజా సేవలో యువ రాజకీయం:
- సర్పంచ్‌లుగా సత్తా చాటుతున్న యువతరం
- ప్రజలకు చేరువవుతూ.. అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రత్యేక గుర్తింపు
కొల్చారం ; గ్రామీణ రాజకీయాల్లో యువతరం జోరు పెరుగుతోంది. ప్రజా సమస్యలపై తక్షణం స్పందిస్తూ.. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న పలువురు యువ నాయకులు సర్పంచ్‌లుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.వివిధ రాజకీయ పార్టీలకు చెందిన యువ సర్పంచ్‌లు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ గ్రామాభివృద్ధిలో తమదైన ముద్ర వేస్తున్నారు.ప్రజలే బలం.. అభివృద్ధే లక్ష్యంప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతున్న యువ నాయకత్వానికి గ్రామాల్లో మంచి స్పందన లభిస్తోంది. యువతను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో పలువురు సర్పంచ్‌లు చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
రాజకీయాలకు కొత్త ఊపిరి.. యువ నాయకత్వంప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువ సర్పంచ్‌లు గ్రామీణ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వివిధ పార్టీల్లో కార్యకర్తలుగా ప్రస్థానం ప్రారంభించి.. పార్టీకి అండగా నిలుస్తూ.. ప్రజా సమస్యలపై పోరాడుతూ సర్పంచ్‌లు, పార్టీ పదవుల వరకు ఎదిగి తమ సత్తా చాటుతున్నారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన పలువురు యువ నాయకులు విజయం సాధించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.గ్రామాల వారీగా యువ నాయకుల ప్రత్యేక గుర్తింపు
పైతర గ్రామం సర్పంచ్ రవితేజ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో యువ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సర్పంచ్‌గా గెలుపొందడంతో పాటు మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతూ తనదైన ముద్ర వేస్తున్నారు.
అప్పాజీపల్లి సర్పంచ్ వెంకట్ గౌడ్ (గజిని) రెండుసార్లు సర్పంచ్‌గా కొనసాగుతూ మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
పతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ బీజేపీ నుంచి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సేవలో చురుకుగా పాల్గొంటున్నారు. గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.ఘనపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
రంగంపేట సర్పంచ్ స్వప్న విజయ్ గ్రామంలోని వివిధ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు.రాంపూర్ సర్పంచ్ నెల్లి రాజు కాంగ్రెస్ పార్టీలో సేవలందిస్తూ గ్రామాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.తుక్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు బీఆర్‌ఎస్ పార్టీలో కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి యువ నాయకుడిగా ఎదిగి సర్పంచ్‌గా గ్రామానికి సేవలందిస్తున్నారు.అంశానిపల్లి సర్పంచ్ గీతా రమేష్ బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు.వసురం తండా సర్పంచ్ వినోద్ నాయక్ యువకుడిగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ గ్రామాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు.కోనాపూర్ సర్పంచ్ మోతుకు మల్లేశం గ్రామంలోని సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
సీతారాం తండా సర్పంచ్ కమిలి మోహన్ గ్రామంలో సమస్యలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.కిష్టాపూర్ సర్పంచ్ పోశయ్య గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు చేరువగా ఉంటూ పార్టీతో పాటు ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారు.
మండల స్థాయిలోనూ యువ నాయకత్వం
కొల్చారం మండలంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన యువ మండల అధ్యక్షులు కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సంతోష్ రావు యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు యువకులకు చేరువగా ఉంటూ, ఇతర సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి మండల యువ నాయకుడిగా ఎదిగి పార్టీకి సేవలందిస్తున్నారు.కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేష్ గౌడ్ పార్టీ కార్యకర్తలు, మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై తక్షణం స్పందిస్తూ యువ నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు.
బీజేపీ మండల అధ్యక్షుడు పంతులు హరీష్ పార్టీ కార్యక్రమాలతో పాటు మండలంలోని ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.యువతరానికి ఆదర్శంగా..
కొల్చారం మండలంలో యువ సర్పంచ్‌లు, యువ రాజకీయ నాయకులు తమ సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు నిరంతరం అండగా నిలుస్తూ యువత సత్తాను చాటుతున్నారు. ప్రజా సేవ, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న వీరి నాయకత్వం రాబోయే తరాల యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.