దళితులను ఆదుకొండి సారు..! • పోడు భూములకు పట్టా ఇవ్వాలి
దళితులను ఆదుకొండి సారు..!
• పోడు భూములకు పట్టా ఇవ్వాలి
జహీరాబాద్, :తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వం పేద దళితుల పక్షపాతి అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవదళ్ ఉపాధ్యక్షులు నర్సింలు దళితుల సమస్యలను వివరించారు. మండల పరిధిలోని రాయిపల్లి (డి) గ్రామంలో నిరుపేదలైన దళితులు అయిదాల సరోజమ్మ, అయిదాల భుజ్జమ్మలకు భూమి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టా ఇచ్చి వారిని ఆదుకోవాలని మంత్రిని కోరారు. వారి కుటుంబం కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని ఈ విషయంపై స్పందించి ఎక్కడైన, ఏడైన కనీసం కూడు, గుడ్డ, కోసం ప్రభుత్వం బ్రతుకు దేరువు కోసం ప్రభుత్వ భూమిని ఇవ్వాలని వేడుకున్నారు.