BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్

Select Suryaa Now
కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్

*వీధి కుక్కల నియంత్రణకు ఏబీసీ కార్యక్రమం*

*కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్

కోహిర్ :కోహిర్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వీధి కుక్కలను పట్టుకొని సంగారెడ్డి అనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రానికి తరలించినట్లు మున్సిపల్ కమిషనర్ సి. శశిధర్ తెలిపారు.వీధి కుక్కల నియంత్రణలో భాగంగా చేపడుతున్న ఏబీసీ కార్యక్రమంలో కుక్కలను శాస్త్రీయ పద్ధతిలో పట్టుకొని, పశువైద్యుల పర్యవేక్షణలో జనన నియంత్రణ శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్) నిర్వహించడంతో పాటు యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా వీధి కుక్కల సంతానోత్పత్తిని నియంత్రించడంతో పాటు రేబీస్ వ్యాధి వ్యాప్తిని తగ్గించడమే లక్ష్యమని వివరించారు.*కోలుకున్న తర్వాత పట్టుకున్న ప్రాంతంలోనే విడుదల*
శస్త్రచికిత్స, వ్యాక్సినేషన్ అనంతరం కుక్కలను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పూర్తిగా కోలుకున్న తర్వాత ఏ ప్రాంతంలో పట్టుకున్నారో అదే ప్రాంతంలో తిరిగి వదిలివేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీధి కుక్కల సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించేందుకు ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.వీధి కుక్కలకు హాని కలిగించడం, వాటిని స్వయంగా ఇతర ప్రాంతాలకు తరలించడం చేయవద్దని అధికారులు సూచించారు. కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నాన్ జావీద్, అనిమల్ బర్త్ కంట్రోల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.