BREAKING
సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్. ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా లాజిస్టిక్స్ రంగంలో చైనా 'ట్రేడ్ సూపర్‌వెపన్' ప్రాజెక్ట్ వెనుకడుగు హైదరాబాద్ మాజీ మేయర్ ఆలంపల్లి పోచయ్య మృతి తూటా పేల్చడానికి సిద్ధమైన సూపర్‌స్టార్.. అంచనాలు పెంచేస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్! మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రఖ్యాత ఆర్చర్ జ్యోతి సురేఖ

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

Select Suryaa Now
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ .

సంగారెడ్డి ;  ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల  సమస్యలను స్వయంగా ఆలకించిన  కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను పంపించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి నిర్ణీత సమయంలో సత్వర పరిష్కారం చూపాలన్నారు. జిల్లా ప్రజావాణి దరఖాస్తులతో పాటు పెండింగ్‌లో ఉన్న సీఎం ప్రజావాణి దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.  ప్రజావాణిలో మొత్తం 81 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో కలెక్టరేట్‌కు 53, సంగారెడ్డి డివిజన్‌కు 22 , నారాయణఖేడ్ డివిజన్‌కు 5 , జహీరాబాద్ డివిజన్‌కు 1 వినతి అందగా, అందోల్ డివిజన్‌కు ఎలాంటి వినతులు అందలేదని అధికారులు వెల్లడించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు  పరిశీలించి, సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, బీసీ సంక్షేమాధికారి జగదీష్, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, పీడీ గృహనిర్మాణ శాఖ చలపతిరావు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ఎస్.బి. రామాచారి, జిల్లా సంక్షేమాధికారిణి లలిత కుమారి, అదనపు డీఆర్డీఓ బాలరాజ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.