ధర్మబద్ధంగా విద్యను బోధించేది గురువులే
ధర్మబద్ధంగా విద్యను బోధించేది గురువులే
తూప్రాన్; ధర్మబద్ధంగా విద్యను బోధించేది గురువులేనని వారి బోధనతోనే విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉంటున్నారని వారి బోధన మరవరాదని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన ఉపాధ్యాయ సన్మాన ఉత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉన్నతులుగా గురువులేనని వారి అడుగుజాడల్లో క్రమశిక్షణతో బోధన వలననే విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉంటున్నారని అన్నారు .ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం శుభ పరిణామం అని అన్నారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మండలంలోని సర్పంచులు పాల్గొన్నారు.