BREAKING
బ్రెజిల్‌లో తదుపరి ఆర్థిక మంత్రికోసం ఉపాధ్యక్షుడు ఆల్క్‌మిన్ పేరు పరిశీలిస్తున్న లూలా బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం నామినేషన్స్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ప్రముఖ కంటెస్టెంట్లు హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సడలుతోందా? రామకృష్ణారావుకు నివాళులర్పించిన ఎంపీ పురందేశ్వరి 'అవతార్' కాపీరైట్ కేసును కొట్టివేసిన కోర్టు పనులు నాణ్యత లో రాజీ పడవద్దు అమెరికాలో అలాస్కా పవర్ ప్రాజెక్ట్‌కోసం 150 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించనున్న ప్రభుత్వం ఆలస్యం, నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఖాయం : కలెక్టర్ అమెరికా డాలర్ జోరుకు త్వరలోనే బ్రేక్ కెన్యా పౌరులకు డాంగోట్ రిఫైనరీ ఐపీఓలో అవకాశం జైలర్ 2 ట్రైలర్ విడుదల: ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ రిటర్న్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విద్యా బాలన్‌లతో భారీ యాక్షన్ సందడి ఉమ్మడి జిల్లా జట్టుకు నారాయణపేట విద్యార్థి ఎంపిక క్రిప్టో మార్కెట్‌పై నియంత్రణల బిగువు నారాయణపేటలో కొనసాగుతున్న జవాబు పత్రాల మూల్యాంకనము శ్రీవిష్ణు సరసన నటించడం అదృష్టంగా భావిస్తున్నా: హీరోయిన్ మహిమా నంబియార్ ఆసక్తికర వ్యాఖ్యలు

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

Select Suryaa Now
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

వీర్‌సెట్టిపల్లి వాగులో అక్రమ ఇసుక వేట.. 4 ట్రాక్టర్లు సీజ్

అక్రమ ఇసుక వ్యాపారులను ఉపేక్షించేది లేదు

బషీరాబాద్ ఎస్‌ఐ విఠల్

బషీరాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 5): వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం వీర్‌సెట్టిపల్లి వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. బషీరాబాద్ ఎస్‌ఐ విఠల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఇసుక లోడ్‌తో వెళ్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు.సోమవారం ఉదయం మల్కన్‌గిరి సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. దీంతో వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పోలీసులు సీజ్ చేసిన వాహనాల వివరాలు ఇలా ఉన్నాయి. TS34TB4520 ట్రాక్టర్ డ్రైవర్ గోనూర్ గ్రామానికి చెందిన గోవింద్, TS34B4318 డ్రైవర్ అనంతప్ప, TS34D7728 డ్రైవర్ రాజు, TS34TR2722 డ్రైవర్ రెడ్డి గణాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్‌గా పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ విఠల్ వెల్లడించారు. అనుమతులు లేకుండా ఇసుకను తవ్వడం, తరలించడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మండలంలో అక్రమ ఇసుక వ్యాపారులు, రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

 

రిపోర్టర్ కాశీం పాషా.