ఉమ్మడి జిల్లా జట్టుకు నారాయణపేట విద్యార్థి ఎంపిక
నారాయణపేట, సూర్యన్యూస్ :
నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్ జీ ఎఫ్ వాలీబాల్ అండర్ -17 జిల్లా జట్టులో చక్కగా ఆడిన శ్రీసాయి స్కూల్ విద్యార్థి అవినాష్ ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల అధ్యక్షులు శేషమ్మ, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ వసంత రావు శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో మంచిగా ఆడి రాష్ట్ర స్థాయిలో ఆడుటకు ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్టులో స్థానం పొందాలని చూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమీనా, బాలప్ప, హెచ్. నర్సింహా, సురేష్ పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.