BREAKING
పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి గరివిడి లక్ష్మి ట్రైలర్ విడుదల, జానపద బయోపిక్‌లో అదరగొట్టిన ఆనంది, ఆకట్టుకుంటున్న విజువల్స్ నర్సరీ మట్టి లారీలకు టోల్ మినహాయింపు ఇవ్వాలి.. ఎంపీ పురందేశ్వరికి నర్సరీ రైతుల వినతి ప్రయాణికుల రద్దీ నియంత్రణ సన్నద్ధతకు చర్యలు జనాభాకు తగ్గ రాజకీయ వాటా బీసీలకు దక్కాలి డ్రగ్స్‌కు నో చెప్పండి.. రోడ్డు భద్రత పాటించండి 50 ఏళ్లు దాటిన తర్వాత శక్తిని హరించే తప్పులు.. ఏ ఆహారాలు తినాలి, వేటికి దూరంగా ఉండాలి? *నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో జక్కంపూడి బర్త్‌డే సందడి మహాలక్ష్మి పథకానికి ఆడపడచుల నీరాజనాలు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారిన తదుపరి సినిమా మూడేళ్ల విరామం తర్వాత సక్సెస్ కోసం తీవ్ర ప్రయత్నాలు గుంతలమయంగా కానూరు– కాపవరం రహదారి డీజీపీ నీ కలిసిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి

నారాయణపేటలో ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం

Select Suryaa Now
నారాయణపేటలో ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం

నారాయణపేట, సూర్యన్యూస్ : 
పోటీ ప్రపంచంలో రాణించాలంటే తప్పకుండా ఇంగ్లీష్ లో ప్రావీణ్యం కలిగి ఉండాలని టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. నారాయణపేట పట్టణంలో సోమవారం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న ఏఎస్ రెడ్డి తన సొంత ప్రాంతానికి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంత విద్యార్థులు ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లో శిక్షణ పొందాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు వారియర్స్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువతకు ఉచితంగా తరగతులు బోధిస్తున్నట్లు ప్రకటించడం హర్షనీయమన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే వారికి తక్కువ ఫీజుతో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రవికుమార్ గౌడ్, నిర్వాహకులు యాద్గీర్ నారాయణరెడ్డి, లయన్ కన్న జగదీష్, డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఆంజనేయులు, లయన్ శాంత, చక్రవర్తి పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.