BREAKING
పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి గరివిడి లక్ష్మి ట్రైలర్ విడుదల, జానపద బయోపిక్‌లో అదరగొట్టిన ఆనంది, ఆకట్టుకుంటున్న విజువల్స్ నర్సరీ మట్టి లారీలకు టోల్ మినహాయింపు ఇవ్వాలి.. ఎంపీ పురందేశ్వరికి నర్సరీ రైతుల వినతి ప్రయాణికుల రద్దీ నియంత్రణ సన్నద్ధతకు చర్యలు జనాభాకు తగ్గ రాజకీయ వాటా బీసీలకు దక్కాలి డ్రగ్స్‌కు నో చెప్పండి.. రోడ్డు భద్రత పాటించండి 50 ఏళ్లు దాటిన తర్వాత శక్తిని హరించే తప్పులు.. ఏ ఆహారాలు తినాలి, వేటికి దూరంగా ఉండాలి? *నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో జక్కంపూడి బర్త్‌డే సందడి మహాలక్ష్మి పథకానికి ఆడపడచుల నీరాజనాలు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారిన తదుపరి సినిమా మూడేళ్ల విరామం తర్వాత సక్సెస్ కోసం తీవ్ర ప్రయత్నాలు గుంతలమయంగా కానూరు– కాపవరం రహదారి డీజీపీ నీ కలిసిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి

ఆలస్యం, నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఖాయం : కలెక్టర్

Select Suryaa Now
ఆలస్యం, నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఖాయం : కలెక్టర్

- 65 అర్జీలు… రెవెన్యూ వాటా 25

- పెండింగ్ ఫైళ్లపై ప్రత్యేక ఫోకస్

- సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం

-నిర్లక్ష్య అధికారులకు ‘వార్నింగ్’

జిల్లాలో ప్రజావాణి అర్జీల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం, నిర్లక్ష్యం సహించబోమని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి హెచ్చరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఆయన గట్టి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 65 అర్జీలు అందగా, అందులో రెవెన్యూ శాఖకు చెందినవి 25, ఇతర శాఖలకు సంబంధించినవి 40గా నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదుపై అధికారులు వెంటనే స్పందించి, నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో జరిగే ప్రజావాణి సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డివిజన్ స్థాయిలో స్వీకరించిన అర్జీలను వెంటనే నమోదు చేసి పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ హెచ్చరించారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ కె. కిరణ్మయి, చంద్రా రెడ్డి, స్టేట్ ప్రజావాణి కోఆర్డినేటర్ రాకేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

(రంగారెడ్డి - మేజర్ న్యూస్)