10 వీల్‌చైర్ల ఉచిత పంపిణీ
ఒంగోలు: రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ ఆధ్వర్యంలో ఈ రోజు మంగమూరు రోడ్డులోని ఆలపాటి ఆర్కేడ్ వద్ద 10 అపార్టుమెంట్లకు చెందిన నివాసితులకు సుమారు రూ.1.50 లక్షల విలువైన 10 వీల్‌చైర్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు కోగంటి గోపాలకృష్ణ, సెక్రటరీ గుమ్మడి శ్రీధర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ మొలకలపల్లి హరిబాబు, పాస్ట్ సెక్రటరీ నర్రా సురేంద్ర, డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ బండారు లక్ష్మీనారాయణ, ఆలపాటి ఆర్కేడ్ నివాసితులు మీరావలి, హనుమంతరావు, ప్రసాద్ తదితరులు, అలాగే 10 అపార్టుమెంట్ల సభ్యులు పాల్గొన్నారు.