BREAKING
గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్

గిరిజన యువతకు 8న అవగాహన సదస్సు

Select Suryaa Now
గిరిజన యువతకు 8న అవగాహన సదస్సు

మెలియాపుట్టి: గిరిజన యువతలోని ప్రతిభను వెలికితీసి, వారి వినూత్న వ్యాపార ఆలోచనలను ఆచరణలోకి తీసుకెళ్లేందుకు సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ‘ITDA Tribal Entrepreneur Challenge–2026’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీవో పవార్‌ స్వప్నిల్‌  తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఈనెల 8న ఉదయం 10 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గాయత్రి విద్యా పరిషత్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌, విశాఖపట్నం మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ హెచ్‌వోడీ ప్రొఫెసర్‌ రజిని యువతకు వినూత్న వ్యాపార ఆలోచనలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న గిరిజన యువత తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. హాజరయ్యే వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. గిరిజన యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు