ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా
వేముల మేజర్ న్యూస్::--ప్రతి కార్యకర్త పార్టీకి వారధిగా పని చేయాలి అని,ఐడి కార్డ్ ఉన్న ప్రతి కార్యకర్తకు 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది అని వైకాపా మండల కన్వీనర్ నాగెళ్ళ సాంబశివరెడ్డి,మాజీ జడ్పీటీసీ కొకటం వెంకట బయపు రెడ్డి,మాజీ పిసిబి సభ్యులు మరక శివకృష్ణ రెడ్డి,మాజీ ఎంపీపీ చల్లా వెంకట నారాయణ,కడప జిల్లా యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు చల్లా సునీల్ కుమార్ అన్నారు.వేముల మండలం లోని స్థానిక వేములలోనీ పార్టీ కార్యాలయం వద్ద వేముల గ్రామ పంచాయతీ కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం వారు నిర్వహించారు.పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించడంతో పాటు, పార్టీ తరఫున వారికి అండగా ఉంటామనే భరోసా కల్పించే ఉద్దేశంతో ఐడీ కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి,మాజీ జడ్పీటీసీ కొకటం వెంకట బయపురెడ్డి,మాజీ పీసీబీ సభ్యులు మరక శివకృష్ణారెడ్డి,మాజీ ఎంపీపీ చల్లా వెంకట నారాయణ,కడప జిల్లా యువజన విభాగం కార్యనిర్వాహక సభ్యులు చల్లా సునీల్ కుమార్ ,జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి కొట్లూరు సుదర్శన్,పాల్గొని కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలే వైఎస్సార్‌సీపీకి ప్రధాన బలమని అన్నారు. కార్యకర్తల సేవలను గుర్తించి వారికి తగిన గుర్తింపు,ప్రాధాన్యత కల్పించడం పార్టీ బాధ్యతగా పేర్కొన్నారు.గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని,కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.ప్రతి కార్యకర్త పార్టీకి వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరు జగనన్న సైనికులు లాగా పనిచేసే వేముల ఎంపీటీసీ,సర్పంచ్ లను గెలిపించి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి, కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డికి కానుక అందజేయాలన్నారు.ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.అంతే కాకుండా వేముల మండలం లో అన్ని సర్సోంచ్ ఎంపిటిసి లను, జడ్పీటీసీ లను కైవసం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్ రెడ్డి,గ్రామ ప్రెసిడెంట్ పేర్ల రామసుబ్బారెడ్డి,బస్సు సుబ్బారెడ్డి,రాఘవరెడ్డి, రమేష్ రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు ముస్కిన్ వలి,చిన్న సుబ్బారెడ్డి,సుబ్బారెడ్డి,
నాగభూషణం,రాగవేశ్వర, యూత్ అధ్యక్షులు చల్లా శివరామకృష్ణ,సుదీర్, ఇమాం బాషా,ఇమ్రాన్,ఖలీల్,హరినాథ్ రెడ్డి,పేర్ల సదాశివ రెడ్డి,
బాలయ్య,ప్రసాద్,
నాగప్ప, జర్మీయా,సాయి,చంటి,వేముల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.