BREAKING
కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా టైటిల్ ఖరారు.. ఈసారూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే! భక్తి, సేవకే ప్రాధాన్యం.. ఆదర్శంగా ‘టీం విఘ్నేశ్వర’ సమస్యల పరిష్కారమే ధ్యేయం - ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి చెత్తను సద్వినియం చేసుకోవాలి దక్షిణ ఆఫ్రికాలో పెరుగుతున్న ద్వితీయ శ్రేణి ద్రవ్యోల్బణ ముప్పు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. అమెరికాలో దుస్తుల తయారీ సంస్థలపై టెక్సాస్ అటార్నీ జనరల్ విచారణ రాజమహేంద్రవరం పర్యటకానికి నూతన శోభ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 14 ఏళ్ల బాలిక అదృశ్యం కాల్బెమల్‌లో చోరీల కలకలం! ఒకే రాత్రి రెండు ఇళ్లకు కన్నం.. రూ.2.21 లక్షల సొత్తు అపహరణ డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి ఎన్నికల రేసులో చైనా వ్యూహాత్మక అడుగు కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ ప్రజల సహకారంతో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, కాలుష్య నియంత్రణకు కృషి చేయాలి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఒంటరయ్యారు

పోలీస్ విధుల్లో పారదర్శకత.... క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత.

Select Suryaa Now
పోలీస్ విధుల్లో పారదర్శకత.... క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత.

    

అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి:--- జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్....
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. పోలీస్ శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.సోమవారం జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు, ఇతర అధికారులు మరియు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, నేర నియంత్రణ, రాత్రి గస్తీ, వాహనాల తనిఖీలు, చెక్‌పోస్టులు, ఎన్‌ఫోర్స్‌మెంట్, ర్యాలీలు, ప్రజా భద్రత, విలేజ్ పోలీసింగ్, సిబ్బంది సంక్షేమం తదితర అంశాలపై సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు.
పోలీస్ విధుల్లో ఎలాంటి రాజకీయ, వ్యక్తిగత లేదా ఇతర ప్రభావాలకు తావులేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. ఏ ఒక్క వర్గానికో, వ్యక్తికో అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా చట్టప్రకారం అందరికీ సమానంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పోలీస్ శాఖలో అవినీతికి ఏమాత్రం తావు ఉండకూడదని ఎస్పీ స్పష్టం చేశారు. ముఖ్యంగా వాహనాల తనిఖీలు, చెక్‌పోస్టులు, రాత్రి పెట్రోలింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, కేసుల దర్యాప్తు తదితర విధుల సమయంలో సిబ్బంది డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు లేదా సమాచారం వచ్చినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. పోలీస్ శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఎవరూ వ్యవహరించరాదని స్పష్టం చేశారు.జిల్లాలో పగలు, రాత్రి నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక కార్యక్రమాలు, నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నైట్ పెట్రోలింగ్ సిబ్బంది, నైట్ డ్యూటీ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, కార్యకలాపాలను గుర్తించి అవసరమైన చోట వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని విలేజ్ పోలీస్ ఆఫీసర్ల ద్వారా గ్రామస్థాయి నుంచి సరైన సమాచారాన్ని ముందస్తుగా సేకరించాలని ఎస్పీ సూచించారు. నేరాలు, అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల కదలికలు, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఎస్‌హెచ్‌ఓ తమ పరిధిలోని గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి విలేజ్ పోలీస్ ఆఫీసర్లతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది తమ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనుమానాస్పద పరిస్థితులు, వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకురావాలని ఆదేశించారు.విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు తగిన క్రమశిక్షణ, ప్రవర్తనా నియమాలు, యూనిఫామ్ డ్రెస్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.ప్రజలకు అందుబాటులో ఉండే,బాధ్యతాయుతమైన,అవినీతి రహితమైన, పారదర్శకమైన పోలీసింగ్ అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచించారు. పోలీస్ శాఖ ప్రతిష్ట, ప్రజల విశ్వాసం ప్రతి ఒక్కరి పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని, అందువల్ల ప్రతి అధికారి, సిబ్బంది తమ విధులను నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో నిర్వహించాలని స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని పోలీస్ అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.