BREAKING
ప్రజల సంక్షేమం పట్టణాభివృద్దే ద్యేయం ఎబివిపి వివిధ విభాగాల ఇంచార్జిల నియామకం త్రాగునీటి సమస్య తలెత్తితే సహించేది లేదు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి . జిల్లా పోలీస్ “మీకోసం” కు 100 ఫిర్యాదులు ఇంటింటికీ సురక్షిత తాగునీరు జలజీవన్‌ మిషన్‌–అమరజీవి జలధారకు రూ.150 కోట్లు వీఆర్ఏలకు తహసిల్దార్ సహాయం గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయండి మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడి అరెస్టు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతి శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్‌కు ఘన సత్కారం ఉప్పు ఎక్కువగా తింటున్నారా? రక్తపోటుతో పాటు ఎలాంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయో తెలుసా! 10 వీల్‌చైర్ల ఉచిత పంపిణీ అలంకారప్రాయంగా దర్శనమిస్తున్న బాలాజీ నగర్ మల్టీ పర్సస్ హాల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మొగిలిచర్లలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం అద్దంకిలో ఈనెల 6, 7, 8 తేదీలలో 'సేవా సేతు' ప్రత్యేక క్యాంపులు.

ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్.

Select Suryaa Now
ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్.

ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్!
- ఏడాదిలో వన్‌స్టార్‌ స్కూళ్లు టూ-స్టార్‌కు!
-2029 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలు 4-స్టార్ ప్రమాణాలకు..
-ఏడాదిలోగా 1,685 వన్-స్టార్ స్కూళ్లను టూ-స్టార్‌గా అప్‌గ్రేడ్ చేయాలి
-వెయ్యి పాఠశాలలను 5-స్టార్ స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ
-7 వేల హైస్కూళ్లలో కంప్యూటర్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌పై ఫోకస్
-ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ..
-ఏజెన్సీ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి
-రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయంలో నిర్దేశిత లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా చేరుకోవాలని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో వసతుల కల్పన, నైపుణ్యాభివృద్ధి అంశాలపై సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఏడాదిలోగా రాష్ట్రంలోని వన్-స్టార్ పాఠశాలలన్నింటినీ టూ-స్టార్‌ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రస్తుత విద్యా సంవత్సరంలోగా జీరో-స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాలలన్నింటినీ కనీసం వన్-స్టార్ స్థాయికి చేర్చాలని సూచించారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను 4-స్టార్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని, కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్ స్థాయికి చేర్చేలా పటిష్ఠ ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లోని పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 "లీప్ స్కూళ్లను" అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,685 వన్-స్టార్... 15,618 టూ-స్టార్... 19,099 త్రీ-స్టార్... 7,172 ఫోర్-స్టార్ పాఠశాలలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పురోగతిపై డీఈవోలు, ఎంఈవోలు, సీఆర్‌పీలకు బాధ్యతలు అప్పగించాలని లోకేశ్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల హైస్కూళ్లలో పూర్తిస్థాయిలో కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అకడమిక్ సంస్కరణలు పూర్తయినందున, ఇకపై అధికారులు, ఉపాధ్యాయులు పూర్తిగా అభ్యసన ఫలితాల మెరుగుదలపైనే దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) ద్వారా ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్, నేషనల్ అప్రెంటిస్‌షిప్ స్కీమ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. నిరుద్యోగ యువతను "నైపుణ్యం పోర్టల్" పరిధిలోకి తీసుకువచ్చి, ఏఐ సాంకేతికత ద్వారా వారికి ఇంటర్వ్యూలు నిర్వహించాలన్నారు. సీడాప్, ఓంక్యాప్‌ల ద్వారా జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో శిక్షణనిచ్చి, విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మానవ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ సీఈవో నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.