బీజేపీ ఎండోమెంట్ సెల్ హైదరాబాద్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష నియామకం
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ (ధార్మిక) హైదరాబాద్ సెంట్రల్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా జూబ్లీహిల్స్, బాలాబండకు చెందిన శ్రీమతి కె. ఉషను నియమించారు. రాష్ట్ర కన్వీనర్ అన్నవజ్జుల సూర్యప్రకాశ్, రాష్ట్ర కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ సిద్ధాంతాలు, ఎండోమెంట్ సెల్ నియమ నిబంధనలకు లోబడి నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని పత్రంలో సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయి సభ్యులను కూడా నియమించారు.
బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా:
శ్రీ లంకాల దీపక్ రెడ్డి – బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు
కుంబాల గంగరాజు – హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు
డి. ప్రేమ్ కుమార్ – హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కమిటీ:
అన్నవజ్జుల సూర్యప్రకాశ్ – రాష్ట్ర కన్వీనర్
నిరంజన్ దేశాయ్ – రాష్ట్ర కో-కన్వీనర్
డి. శివ ప్రసాద్ – రాష్ట్ర జాయింట్ కన్వీనర్
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఎండోమెంట్ సెల్ కమిటీ:
పోచల ప్రసాద్ – జిల్లా కన్వీనర్
తోట మల్లికార్జున్ – జిల్లా కో-కన్వీనర్
సంతోష్ – జిల్లా కో-కన్వీనర్
కె. ఉష – జిల్లా జాయింట్ కన్వీనర్
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు ఉష కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకులు సూర్యప్రకాశ్, నిరంజన్ దేశాయ్‌తో పాటు శివ ప్రసాద్, పి. ప్రసాద్‌లకు ధన్యవాదాలు చెప్పారు. తనకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, అలాగే ఎల్. దీపక్ రెడ్డి, ప్రేమ్ కుమార్, గంగరాజు, గౌతమ్‌లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ జిల్లా, జూబ్లీహిల్స్ బీజేపీ బృందాలకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ బాధ్యత కేవలం గౌరవం కాదని, సేవ చేయడానికి లభించిన గొప్ప అవకాశమని ఉష అన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సహచరులకు అభినందనలు తెలిపారు. అందరం ఐక్యతతో కలిసి పనిచేసి సంస్థను బలోపేతం చేస్తూ, దేవాలయాలు, ధర్మం, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. "సేవ, ధర్మం, దేశమే ప్రథమం" అనే స్ఫూర్తితో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. నియమితులైన నాయకులంతా పార్టీ బలోపేతానికి, ఆలయాలు, ధార్మిక సంస్థల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.