ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజన వసతి
కనిగిరి ,మేజర్ న్యూస్ :స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో స్నేహ హస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రోగులు, వారి బంధువులు మరియు ఆహార వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఉచిత భోజన వసతి కల్పించారు .ఈ సందర్భంగా ట్రస్ట్ కన్వీనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ, చాట్లా హీమా వర్ధన్ కుటుంబ సభ్యుల సహకారంతో భోజనం అందించడం జరిగిందన్నారు .ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తూ మరెందరికో ఉపశమనం కలిగించాలనేది మా లక్ష్యం అని తెలిపారు.అన్నదానం కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన హీమా వర్ధన్ వారి కుటుంబ సభ్యులకు ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గౌస్, బేబీ రాజ్,డేవిడ్, కిషోర్ బాబు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.