తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సందర్శించిన విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సోనాకియా సోమవారం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ను సందర్శించారు. గత రెండు సంవత్సరాలుగా 18 రైళ్లను తాడేపల్లిగూడెంలో స్టాప్ ఇవ్వాలని వినత పత్రాలు అందిస్తున్నప్పటికిని వాటిలో పురోగతి లేదని పలువురు అభిప్రాయపడ్డారు. రైల్వే స్టేషన్ కు మరిన్ని ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచాలని రైల్వే జోనల్ కమిటీ సభ్యుడు, తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రవి అగర్వాల్ వినతి పత్రం అందిస్తూ విజ్ఞప్తి చేశారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం