జిల్లా వి202ఏ గవర్నర్ గా సన్నిధి సూర్యనారాయణమూర్తి
తాడేపల్లిగూడెం/పాలకొల్లు, మేజర్ న్యూస్; వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 2027 సంవత్సరానికి జిల్లా వి202ఏ గవర్నర్ ఎన్నిక పాలకొల్లులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవిఎన్ గోల్డెన్ స్టార్ కే సి జి ఎఫ్ సన్నిధి సన్నిధి సూర్యనారాయణమూర్తి నామినేషన్ వేయడానికి సుమారు 30 కార్ల ర్యాలీతో సుమారు 100 మంది తో బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వాసవి క్లబ్, వనిత క్లబ్, మాధవరం వాసవి క్లబ్ సభ్యులు శ్రీ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. పూర్వాధ్యక్షులు మండ బ్రహ్మాజీ, కొల్లేపర రాము, నున్న సుందర రావు పలువురు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నుండి 25 సంవత్సరాల కాలంలో మొట్ట మొదటిసారిగా ఒక గవర్నర్ ముందుకు రావడం శుభ సూచకం అని జిల్లా వ్యాప్తంగా వారు మంచి సేవలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు ఆలపాటి కృష్ణకుమార్, కార్యదర్శి ముత్త శ్రీధర్ గుప్తా, ట్రెజరర్ పులవర్తి సాయి ప్రశాంత్, జోన్ చైర్ పర్సన్స్ పసుమర్తి అనిల్, పొన్నగంటి స్వర్ణకాంతి, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఏకాంబరం, పూర్వాధ్యక్షులు రాంపండు, రాజా రాంబాబు, సంతోష్, ఎన్ఆర్ఎల్ గుప్తా, సుబ్రమణ్యం, చైతన్య, ఉమా, వైకుంఠం, శ్రీ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి భోగవల్లి రమేష్, వనిత క్లబ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీత కోశాధికారి శ్యామల, పూర్వాధ్యక్షులు నున్న శ్రీ నాగలక్ష్మి, ఆలపాటి అచ్యుతలక్ష్మి, చొప్పెర్ల రుక్మిణి ఆర్యవైశ్య సంఘ పెద్దలు పాల్గొన్నారు. శ్రీ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు పెనుగొండ శ్రీను అమ్మవారి జండా ఊపి ర్యాలీ ప్రారంభించినారు. పాలకొల్లు లో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత 2027 సంవత్సరానికి గవర్నర్గా సన్నిధి సూర్యనారాయణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. వాసవి క్లబ్ సభ్యులు ఆర్య సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సన్నిధి సూర్యనారాయణమూర్తికి అభినందనలు తెలియజేశారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం