శ్రీ నీలమణిదుర్గ ఆలయంలో మంగళవారం‘వరుణయాగం’.
పాతపట్నం అక్టోబర్ 5,మేజర్ న్యూస్: పాతపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నీలమణిదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీన మంగళవారం ‘వరుణ జపం,వరుణయాగం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అక్కంద్ర సన్యాసిరావు, కార్యనిర్వహణాధికారి (ఈవో) బి.వాసుదేవరావు తెలిపారు.రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుభిక్షంగా, క్షేమంగా ఉండాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అక్కంద్ర సన్యాసిరావు, కమిటీ సభ్యులు, ఈవో బి.వాసుదేవరావు కోరారు.