స్థల దాతలను సత్కరించిన సభ్యులు
దేవరపల్లి, అక్టోబర్ 5 మేజర్ న్యూస్:
వాసవి జాగృతి ఇంటర్నేషనల్ పర్మినెంట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉదారంగా స్థలాన్ని విరాళంగా అందించిన శ్రీకాకుళపు కాళీ కృష్ణ - అరుణ దంపతులను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సభలో, కాళీ కృష్ణ, అరుణ దంపతులకు సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సమాజ సేవలో భాగస్వాములవుతూ, పర్మినెంట్ ప్రాజెక్ట్ కోసం ఎంతో విలువైన స్థలాన్ని కేటాయించిన వారి సేవలను సభ్యులు కొనియాడారు. అనంతరం కాళీ కృష్ణ - అరుణ దంపతులను శాలువాతో కప్పి, పూలమాలలు మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ప్రముఖ నాయకులు, ప్రతినిధులు మరియు సభ్యులు పాల్గొని, స్థలదాతల ఉదారతను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.