గంజాయి స్మగ్లర్ పై ఉక్కుపాదం పి ఐ టి. ఎన్ డి పి ఎస్ చట్టం కింద పాత నేరస్థుడి రిమాండ్
గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యం... సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ.
నర్సీపట్నం జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో వరుస నేరాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌పై పి ఐ టి ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1988) కింద డిటెన్షన్ ఉత్తర్వులు అమలు చేయడం జరిగిందని నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రేవతమ్మ తెలిపారు.
నిందితుడి వివరాలు – నేర చరిత్ర:
గొలుగొండ మండలం, పాత కే.డీ.పేట గ్రామానికి చెందిన ఉప్పాటి వెంకటేశ్ (23), తండ్రి: రాజు, అలవాటుపడ్డ నేరస్థుడిగా గుర్తించబడ్డాడు. ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు భారీ ఎత్తున అక్రమంగా గంజాయిని తరలిస్తున్నాడు. ఇతనిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో 4 గంజాయి కేసులు నమోదయ్యాయి:
కే.డీ.పేట పోలీస్ స్టేషన్ – 01 కేసు
కాకినాడ జిల్లా, ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ – 02 కేసులు
కాకినాడ జిల్లా, అన్నవరం పోలీస్ స్టేషన్ – 01 కేసు
గతంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పటికీ నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. నిరంతరం గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ సమాజ శాంతిభద్రతలకు, యువత భవిష్యత్తుకు ముప్పుగా మారడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇతనిపై పి ఐ టి ఎన్ డి పి ఎస్ చట్టం కింద ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి అని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు..
అరెస్ట్ – జైలుకు తరలింపు:
నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎన్ డి పి ఎస్ ల్ ఇన్‌స్పెక్టర్ పిల్లా రమేష్, కే.డీ.పేట ఎస్సై వి.రుషికేశ్వరరావు మరియు సిబ్బంది పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.
జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐ.పి.ఎస్. హెచ్చరిక:
"జిల్లాలో గంజాయి దందాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగుతోంది. గంజాయి సాగు చేసినా, నిల్వ ఉంచినా, కొనుగోలు చేసినా లేదా రవాణా చేసినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. పదేపదే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పి ఐ టి ఎన్ డి పి ఎస్ మరియు పీడీ యాక్ట్ వంటి అత్యంత కఠినమైన చట్టాలను ప్రయోగిస్తాం అని పోలీసులు తెలిపారు