శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,66,588 రూపాయలు
సిఎస్ పురం,మేజర్ న్యూస్: ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం 1,66,588 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీగిరిరాజు నరసింహబాబు తెలిపారు.ఈసందర్భంగా పూజాటికెట్లు విక్రయంద్వారా 50,680 లడ్డుప్రసాదం అమ్మకం ద్వారా 22,200 శాశ్వత అన్నదాన పథకానికి స్వామివారి 78,076 శ్రీపాదకానుకల ద్వారా స్వామివారి పంచామృత 10,116 అభిషేకం పూజలకు 5,516 కలిపి మొత్తం 1,66,588 రూపాయలు వచ్చినట్లు ఈఓ తెలిపారు. శాశ్వత అన్నదాన పథకానికి మార్కాపురం జిల్లా పామూరు మండలం తూర్పుకోడిగుడ్లపాడు వాస్తవ్యులు దారపునేని సూర్యనారాయణ మహాలక్ష్మమ్మ దంపతులు 50,000 రూపాయలు ఇచ్చినట్లు దేవస్థానం తరపున దాతలను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేసి అభినందనలు తెలిపినట్లు ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు తెలిపారు.