BREAKING
స్థల దాతలను సత్కరించిన సభ్యులు స్వార్థం కోసం కాదు.. ఊరి అభివృద్ధి కోసమే త్యాగం చేశా బ్రెజిల్‌లో తదుపరి ఆర్థిక మంత్రికోసం ఉపాధ్యక్షుడు ఆల్క్‌మిన్ పేరు పరిశీలిస్తున్న లూలా బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం నామినేషన్స్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ప్రముఖ కంటెస్టెంట్లు హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సడలుతోందా? రామకృష్ణారావుకు నివాళులర్పించిన ఎంపీ పురందేశ్వరి 'అవతార్' కాపీరైట్ కేసును కొట్టివేసిన కోర్టు పనులు నాణ్యత లో రాజీ పడవద్దు అమెరికాలో అలాస్కా పవర్ ప్రాజెక్ట్‌కోసం 150 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించనున్న ప్రభుత్వం ఆలస్యం, నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఖాయం : కలెక్టర్ అమెరికా డాలర్ జోరుకు త్వరలోనే బ్రేక్ కెన్యా పౌరులకు డాంగోట్ రిఫైనరీ ఐపీఓలో అవకాశం జైలర్ 2 ట్రైలర్ విడుదల: ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ రిటర్న్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విద్యా బాలన్‌లతో భారీ యాక్షన్ సందడి ఉమ్మడి జిల్లా జట్టుకు నారాయణపేట విద్యార్థి ఎంపిక క్రిప్టో మార్కెట్‌పై నియంత్రణల బిగువు

పాతపట్నం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే మావిడి గోవిందరావు తీవ్ర ఆగ్రహం

Select Suryaa Now
పాతపట్నం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే మావిడి గోవిందరావు తీవ్ర ఆగ్రహం

పాతపట్నం అక్టోబర్ 5,మేజర్ న్యూస్:పాతపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. సోమవారం పాతపట్నం పట్టణంలోని దువ్వార వీధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జలజీవన్ మిషన్ పథకం పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ పనులకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరణ, భూమిపూజ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మావిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరై పనులను లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర దుమారానికి దారితీసింది. ప్రభుత్వ మార్గదర్శకాలు, విధివిధానాల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన అధికారిక బ్యానర్‌లో కనీస ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల వేదికపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, 

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను సైతం ముద్రించకపోవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం సంబంధిత శాఖల కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఫోటోలు గానీ, జిల్లా పరిపాలనాధికారి అయిన కలెక్టర్ ఫోటోను కూడా బ్యానర్‌లో చేర్చకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక శాసనసభ్యుడిగా తన ఫోటో లేకపోయినా తాను పెద్దగా పట్టించుకోనని, కానీ దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల చిత్రాలను విస్మరించి, అధికారిక ప్రభుత్వ బ్యానర్‌పై ఇప్పటికీ గత ప్రభుత్వానికి చెందిన వైసీపీ నేతల పేర్లను ముద్రించి ఆర్భాటంగా ప్రదర్శించడం అధికారుల నిర్లక్ష్యానికి, ఏకపక్ష వైఖరికి పరాకాష్ట అని ఆయన నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉంటూ కూడా పూర్వపు ప్రభుత్వ నేతల ప్రాపకం కోసం పాకులాడుతున్నారా లేక కనీస నిబంధనలు కూడా తెలియకుండా విధులు నిర్వహిస్తున్నారా అంటూ ఆర్‌‌డబ్ల్యూఎస్ డిపార్ట్‌మెంట్ అధికారులను ఎమ్మెల్యే మావిడి గోవిందరావు అక్కడికక్కడే కడిగిపారేశారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామంతో అవాక్కయిన అధికారులు సమాధానం చెప్పుకోలేక నీళ్లు నమలగా, ప్రభుత్వ వ్యవస్థలో అధికారుల పనితీరు ఇలా తయా రైందంటూ అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నవ్వుకోవడం నియోజకవర్గవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.