BREAKING
పిడుగుపాటుకు జీలకర్రగూడెంలో రు. 2లక్షల విలువ చేసే గేదె మృతి 27 సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి.. 9న విజయవాడలో నిరసన దీక్షకు తరలిరావాలి.. ఏఐబిడబ్ల్యూఏ జాతీయ అధ్యక్షుడు మనవల ఆంజనేయులు బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాలా? అసలు ఏ ఆహారం కట్ చేయాలి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు నేడు ఆశా కార్యకర్తలు విధులు బహిష్కరణ ఏపీఎస్ఆర్టీసీ జై భీమ్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక. శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,66,588 రూపాయలు గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. గొట్టిపాటి లక్ష్మి. నాదెండ్ల మనోహర్ ప్రియ శిష్యుడికి చైర్మన్ పీఠం ఖాయమా? జిల్లా వి202ఏ గవర్నర్ గా సన్నిధి సూర్యనారాయణమూర్తి గంజాయి స్మగ్లర్ పై ఉక్కుపాదం పి ఐ టి. ఎన్ డి పి ఎస్ చట్టం కింద పాత నేరస్థుడి రిమాండ్ రోడ్ల నిర్మాణనికి ప్రాధాన్యం. గొట్టిపాటి లక్ష్మి. రోజూ కూరగాయలు తింటున్నా ఒంట్లో ఐరన్ ఎందుకు తగ్గుతుంది? ఈ పదార్థాలతో చెక్ పెట్టండి! ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజన వసతి శ్రీ నీలమణిదుర్గ ఆలయంలో మంగళవారం‘వరుణయాగం’.

విజయవంతంగా ముగిసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
విజయవంతంగా ముగిసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పటాన్‌చెరు, ;  తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పటాన్‌చెరు నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిందని ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణ హరిపంతులు తెలిపారు. సోమవారం ముత్తంగి డివిజన్‌లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా కాటా శ్రీనివాస్ గౌడ్, పార్లమెంటు ఇన్‌చార్జి నీలం మధు నాయకత్వంలో కృషి చేస్తున్నామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారడంతో పాటు లబ్ధిదారులకు సరుకుల పంపిణీ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ నాయకులు అశోక్ ముదిరాజ్, వాలిదాస్ గోపాలకృష్ణ, ఎల్లగారి ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్, కమ్మరి శ్రీనివాస్ చారి,రంజిత్, మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.