andhrapradesh
27 సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి.. 9న విజయవాడలో నిరసన దీక్షకు తరలిరావాలి.. ఏఐబిడబ్ల్యూఏ జాతీయ అధ్యక్షుడు మనవల ఆంజనేయులు
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాప్ రిపోర్టర్)
గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని ఏఐబిడబ్ల్యూఏ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనవల ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ నెల 9న విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించే నిరసన దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సోమవారం అనంతపురంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రద్దైన సంక్షేమ పథకాలను పునరుద్ధరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా బహుజనులు, ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాల ప్రజలు, సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విజయవాడకు తరలివచ్చి నిరసన దీక్షను విజయవంతం చేయాలని ఆంజనేయులు కోరారు.