andhrapradesh
సేవా సేతు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
సేవాసేతు అభియాన్‌ను సద్వినియోగం చేసుకోవాలి
– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, అక్టోబర్5 మేజర్ న్యూస్: సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవాసేతు అభియాన్‌ను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. సోమవారం స్థానిక కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ నెల 6, 7, 8 తేదీల్లో అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల వినియోగదారులకు, చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల వినియోగదారులకు సేవాసేతు అభియాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తుల స్వీకరణ, సాంకేతిక సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. బ్యాంకు అధికారులు కూడా పాల్గొని రుణ సదుపాయాలపై సహకరిస్తారన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీని వినియోగించుకుని సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో చల్లపల్లి ఏడీఈ పేర్ని రవికుమార్, ఘంటసాల ఏఈ పిరియా రవికుమార్ పాల్గొన్నారు.
-అజంతా శ్రీను అవనిగడ్డ