BREAKING
కడప పెద్ద దర్గా ఉర్సుకు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన దర్గా పెద్దలు గిరిజనులకు న్యాయం చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించను రెడ్‌క్రాస్ డైరెక్టర్‌గా* కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి స్వచ్ఛ పార్వతీపురం – మన్యం మర్యాద సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం

Select Suryaa Now
భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం

యర్రగుడిపల్లిలో యూజీడీ సమస్యకు పరిష్కార చర్యలు

భాకరాపురం పెండింగ్‌ రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశం

పులివెందుల మేజర్ న్యూస్:

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని యర్రగుడిపల్లి ప్రాంతంలో గత ఎనిమిది నెలలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న యూజీడీ సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్‌ ఇన్‌చార్జ్‌ వైఎస్‌ మనోహర్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తన సొంత నిధులతో మోటార్‌ను ఏర్పాటు చేసి, యూజీడీలో నిలిచిపోయిన మురుగునీటిని బయటకు పంపింగ్‌ చేయించారు.
సుమారు నాలుగు గంటల పాటు ఎండలోనే అక్కడ ఉండి పనులను స్వయంగా పర్యవేక్షించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో యర్రగుడిపల్లి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.
అలాగే భాకరాపురంలో పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను పరిశీలించిన వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్‌, సీనియర్‌ వైసీపీ నాయకులు కోడి రమణ, మాజీ కౌన్సిలర్‌ పురుషోత్తం, మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు చంద్రమౌళి, నాయకులు భాస్కర్‌, కృష్ణమూర్తి, సుమిత్రన్‌ తదితరులు పాల్గొన్నారు.