సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు
సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు
కంది ; సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్‌గా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించేందుకు కృషి చేస్తానని సందీప్ కుమార్ తెలిపారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.