జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా అత్తిలి గోపాల్
హైదరాబాద్ సూర్య న్యూస్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ (ధార్మిక) జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌గా అత్తిలి గోపాల్ నియమితులయ్యారు. రాష్ట్ర కన్వీనర్ అన్నవజ్జుల సూర్యప్రకాశ్, రాష్ట్ర కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్ సంతకాలతో కూడిన నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు.
బీజేపీ సిద్ధాంతాలు, ఆదర్శాలతో పాటు ఎండోమెంట్ సెల్ నియమ నిబంధనలకు లోబడి నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో వ్యవహరించాలని నియామక పత్రంలో సూచించారు. సహచర కార్యకర్తలను, అనుభవజ్ఞులను గౌరవిస్తూ, పార్టీ ఇతర కమిటీలు, మోర్చాలు, సెల్‌లతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేపట్టి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ అన్ని వర్గాలు, ప్రాంతాల్లో విస్తరించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
నియామక పత్రాన్ని స్వీకరించిన అనంతరం గోపాల్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయాలు, ధర్మ పరిరక్షణకు, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.
Also Read: హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష