BREAKING
కడప పెద్ద దర్గా ఉర్సుకు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన దర్గా పెద్దలు గిరిజనులకు న్యాయం చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించను రెడ్‌క్రాస్ డైరెక్టర్‌గా* కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి స్వచ్ఛ పార్వతీపురం – మన్యం మర్యాద సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష

Select Suryaa Now
హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ (ధార్మిక) హైదరాబాద్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా శ్రీమతి కె. ఉష నియమితులయ్యారు. రాష్ట్ర కన్వీనర్ అన్నవజ్జుల సూర్యప్రకాశ్, రాష్ట్ర కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఆమె, పార్టీ సిద్ధాంతాలు, ఎండోమెంట్ సెల్ నియమ నిబంధనలకు లోబడి నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని నియామక పత్రంలో సూచించారు.

తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు ఉష కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకులు సూర్యప్రకాశ్, నిరంజన్ దేశాయ్‌తో పాటు శివ ప్రసాద్, పి. ప్రసాద్‌లకు ధన్యవాదాలు చెప్పారు. తనకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, అలాగే ఎల్. దీపక్ రెడ్డి, ప్రేమ్ కుమార్, గంగరాజు, గౌతమ్‌లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ జిల్లా, జూబ్లీహిల్స్ బీజేపీ బృందాలకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ బాధ్యత కేవలం గౌరవం కాదని, సేవ చేయడానికి లభించిన గొప్ప అవకాశమని ఉష అన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సహచరులకు అభినందనలు తెలిపారు. అందరం ఐక్యతతో కలిసి పనిచేసి సంస్థను బలోపేతం చేస్తూ, దేవాలయాలు, ధర్మం, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. "సేవ, ధర్మం, దేశమే ప్రథమం" అనే స్ఫూర్తితో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు.