గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల
గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల
పటాన్ చెరువ; వ్రాతప్రతి నుంచి మార్కెట్ వరకు.. సంపాదకత్వం, ప్రచురణలను విద్యార్థులకు పరిచయం చేస్తూ, దానిని ఆచరణాత్మకంగా తెలియజేసే రెండు రోజుల కార్యశాల సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ప్రారంభమైంది. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)కు చెందిన ఆంగ్ల, ఇతర భాషల విభాగం దీనిని ఏర్పాటు చేసింది. ఓరియంట్ బ్లాక్ స్వాన్, జుబాన్ బుక్స్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో పాల్గొనే వారికి సమకాలీన ప్రచురణ పద్దతులపై ఆచరణాత్మక అవగాహనను అందిస్తోంది. ఈ సందర్భంగా, జుబాన్ వారి ‘పోస్టర్ ఉమెన్’ కలెక్షన్ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యశాలలో స్త్రీవాద రచయిత్రి, ప్రచురణకర్త, యాక్టివిస్ట్ ఊర్వశి బుటాలియా, ది ఇండియా ఫోరమ్ ఎడిటర్-ఇన్-చీఫ్ సి.రామ్మనోహర్ రెడ్డి, ఓరియంట్ బ్లాక్ స్వాన్. హ్యుమానిటీస్ అసిస్టెంట్ పబ్లిషర్ శ్రీనాథ్ శ్రీధరన్ తో సహా పలువురు ప్రముఖ పబ్లిషింగ్ నిపుణులు పాల్గొంటున్నారు.తొలిరోజు, ఎస్. శ్రీనాథ్ ప్రచురణ వ్యవస్థ, సంపాదకీయ పని విధానాలు, విద్యాపరమైన పుస్తక నిర్మాణం, కాపీరైట్, అనుమతులు, సంస్థాగత శైలి ప్రమాణాలు, అలాగే కంటెంట్, కాపీ ఎడిటింగ్ వంటి అంశాలపై దృష్టి సారించారు. ఒక వ్రాతప్రతిని ప్రచురణ దశకు తీసుకువెళ్లడంలో ఇమిడి ఉన్న సంపాదకీయ, ఉత్పత్తి ప్రక్రియలపై ఇందులో పాల్గొంటున్న వారికి ఆచరణాత్మక అవగాహన కల్పించడానికి, ఒక ప్రత్యేక కాపీ-ఎడిటింగ్ అభ్యాసాన్ని నిర్వహించారు.రెండు రోజు ఊర్వశి బుటాలియా, డాక్టర్ సి. రామ్మనోహర్ రెడ్డిల సెషన్లు ఉంటాయి. ‘చారిత్రక రికార్డుల అన్వేషణలో స్త్రీవాదులు’, ‘స్త్రీవాద ప్రచురణ రాజకీయాలు, ఆచరణ’ అనే అంశాలపై ఊర్వశి ప్రసంగించనున్నారు. పోస్టర్ ఉమెన్ ఆర్కైవ్ ను నిర్మించడంలో జుబాన్ అనుభవాన్ని, దాని ప్రచురణ కార్యక్రమం యొక్క పరిణామాన్ని, ప్రచురణ, రాజకీయాలు, భావజాలం, ఆర్థిక శాస్త్రం మధ్య ఉన్న సంబంధాన్ని అన్వేషిస్తారు. అలాగే డాక్టర్ రెడ్డి ‘డిజిటల్ వార్తా ప్రచురణ: అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశ డిజిటల్ వార్తా రంగం, దాని ప్రభావం, పరిమితులు, ఈ రంగానికి వస్తున్న అవకాశాలను పరిశీలిస్తారు.ఈ కార్యశాల, ఒక వ్రాతప్రతి ప్రయాణంలోని వివిధ దశలైన ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ నుంచి ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యాప్తి వరకు విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా, విద్య, ప్రచురణ పరిశ్రమకు మధ్య ఉన్న సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది.ఈ కార్యక్రమాన్ని ఆంగ్ల, ఇతర భాషల విభాగం అధ్యాపకులు డాక్టర్ దేబద్రిత చక్రవర్తి, డాక్టర్ ప్రతీమ్ దాస్ నిర్వహిస్తున్నారు.
గీతంలో ప్రపంచ వాస్తుశిల్ప దినోత్సవం
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సోమవారం ప్రపంచ వాస్తుశిల్ప దినోత్సవం 2026ను ఘనంగా జరుపుకుంది. పలు విద్యార్థి సృజనాత్మక కార్యక్రమాలతో పాటు విజ్జానదాయకమైన ఆతిథ్య ఉపన్యాసంతో ఇవి మరింత ఆకట్టుకున్నాయి.ప్రఖ్యాత వాస్తుశిల్పి సమర్ రామచంద్ర అసోసియేట్స్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ సమరేంద్ర ఎం. రామచంద్ర ‘గృహనిర్మాణం: ఒక మానవ దృక్పథం’ అనే అంశంపై ప్రసంగించారు. వాస్తుశిల్పాన్ని మానవ-కేంద్రీకృత దృక్పథంతో అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సదస్సు వర్ధమాన వాస్తుశిల్పులకు విలువైన అంతర్దృష్టులను అందించింది. ముఖాముఖిలో వక్తతో వారు చురుకుగా సంభాషించి, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.వివిధ విద్యార్థి కార్యక్రమాలలో విజేతల సృజనాత్మకత, ఉత్సాహాన్ని గుర్తించి, వారికి ప్రశంసా పత్రాలను అందజేయడంతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం విద్యార్థులకు సుసంపన్నమైన, ఆనందదాయమైన అనుభవాన్ని అందించడంతో పాటు, వాస్తుశిల్ప వృత్తి పట్ల వారిలో మరింత మక్కువను పెంపొందించింది.