BREAKING
120 మంది నిరుపేదలకు భూమి చూపించాలని తహసీల్దార్ కు వినతి గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల సేవా సేతు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం. స్వచ్ఛ పంచాయతీగా పత్తికొండకు రాష్ట్రస్థాయి పురస్కారం టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం చుంచుపల్లి తండా వాసి మృతి.. .హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..? ప్రజావాణికి ,కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా అత్తిలి గోపాల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష తెర్లాం గ్రంథాలయం ... శోభాయ మానం : పాఠకులకు సరికొత్త మూత్ర విసర్జన నిలయం గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం

ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, మేజర్ న్యూస్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, ప్రతి అర్జీకి నాణ్యమైన, న్యాయబద్ధమైన, శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజా సంతృప్తినే ప్రధాన ప్రమాణంగా తీసుకుని, గ్రీవెన్స్ పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం తదితర అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాబోయే నెల రోజుల్లో ముఖ్యమంత్రి ‘ప్రజా వేదిక’ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని, ఈ సందర్భంగా శాఖల వారీగా అధికారుల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, ఫిర్యాదులపై స్పందన తదితర అంశాలపై సమగ్ర సమీక్ష జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతికూల నివేదికలు వచ్చే శాఖలు, అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారుల పనితీరును ప్రజాభిప్రాయం, రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా, ఐవీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను ప్రతి అధికారి నిశితంగా పరిశీలించి, తమ పరిధిలో ప్రజా సంతృప్తి ఎందుకు తక్కువగా ఉందో గుర్తించి తక్షణమే సరిదిద్దుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో లేకపోవడం, పిటిషన్లు, ఫిర్యాదులపై సరైన స్పందన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరువూరు, విజయవాడ వెస్ట్ జోన్, జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సంతృప్తి శాతం తక్కువగా ఉండటంపై సంబంధిత అధికారులను ప్రశ్నించి, సమస్యలకు కారణాలను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, శాఖల పనితీరు, ప్రజా సమస్యలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని 14 మండలాల్లో 11 మండలాలు తీవ్ర కరువు పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో రైతులకు అవసరమైన సహాయం అందించడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు రైతుల సమస్యలపై తక్షణమే స్పందించి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం, సేవలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విజయవాడ డివిజన్ పరిధిలో పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న తీరుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో విజయవాడ డివిజన్, రూరల్ మండలం రెడ్ లిస్ట్‌లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అర్జీలను కేవలం సంబంధిత శాఖలకు ఎండార్స్ చేసి బాధ్యత ముగిసిందని భావించరాదని, సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి వాస్తవ సమస్యను గుర్తించి, నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడంలో విఫలమయ్యే లేదా అశ్రద్ధ వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించారు. కేవలం అర్జీల సంఖ్యను తగ్గించడం లేదా గణాంకాలను మెరుగుపరచడం కాకుండా, ప్రజలకు వాస్తవమైన పరిష్కారం అందించడమే ప్రభుత్వ యంత్రాంగం లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్, వ్యవసాయం, రెవెన్యూ తదితర ముఖ్య శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యం, నిర్లక్ష్యం, అనవసర ఇబ్బందులకు తావులేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి అధికారి తమ పరిధిలోని పీజీఆర్‌ఎస్‌ అర్జీలు, ఐవీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్, ప్రజా సంతృప్తి స్కోరు, రియల్ టైమ్ గవర్నెన్స్ డేటాను నిరంతరం పరిశీలించి లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలకు సకాలంలో స్పందిస్తూ నాణ్యమైన పరిష్కారాలు అందించడం ద్వారా జిల్లాను రాష్ట్రంలో గ్రీవెన్స్ పరిష్కారంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి అధికారి కట్టుబాటుతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు.


✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.