ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం
ఉండి, మేజర్ న్యూస్: ఉండి మండలం ఆర్తమూరు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం గ్రామ రెవెన్యూ అధికారి కృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాహసిల్దార్ మంతెన రాంప్రసాద్ రాజు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తున్నామని పాస్ పుస్తకాల్లో ఎటువంటి అభ్యంతరాలు ఉన్న సంబంధిత అధికారులకు రైతులు తెలియచేయాలని వారు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలను పూర్తి పారదర్శకతతో తయారు చేయడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీర్రాజు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రేవు కార్తీక్,వీఆర్వో చిన్నారావు తదితరులు తోపాటు కూటమి నాయకులు, రైతులు, రెవిన్యూ సిబ్బంది, పాల్గొన్నారు.
ఉండి రాజు