బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు..
సూర్య బోయినపల్లి,బోయినపల్లి మండల ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం 2 దరఖాస్తులు వచ్చాయని ఇంచార్జ్ ఎంపీడీఓ శ్రీధర్ గౌడ్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షరీఫ్ మొయినుద్దీన్, మండల అధికారులు పాల్గొన్నారు.