BREAKING
పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి తేజ సజ్జ హోస్ట్‌గా సరికొత్త మైండ్ గేమ్ షో.. ‘ది ట్రైటర్స్’ ట్రైలర్ విడుదల! జడ్పిహైస్కూలు సందర్శించిన విద్యాశాఖ అధికారులు: ఇంకొల్లు 13 అంగన్వాడీ కేంద్రంలో ఫస్ట్కాహార మాస ఉత్సవాలు నారాయణస్వామి దేవస్థానంలో వైభవంగా వరుణయాగం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనపరచిన గిరిజన విద్యార్థులు కడప నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు 100 కోట్ల ప్రయాణాలతో 'స్త్రీ శక్తి' చారిత్రాత్మక ఘనత. -మహిళలతో పాటు ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు గ్రామ గడపకే వైద్యం : మంత్రి సత్యకుమార్ యాదవ్ కోదండ రామునికి ఘనంగా ఘటాభిషేకం మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భారీ విస్తరణ.. ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళ్తున్న అభిమానులు! సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్.. మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ... ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు

ప్రజాస్వామ్య పరిరక్షణకు INDIA కూటమి పిలుపు

Select Suryaa Now
ప్రజాస్వామ్య పరిరక్షణకు INDIA కూటమి పిలుపు

సూర్య కరీంనగర్ ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణ వారంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ INDIA కూటమి నాయకులు కరీంనగర్‌లో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్‌, కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కమిటీల ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం సమావేశం జరిగింది.
చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ మేడిపల్లి సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, తెలంగాణ జన సమితి, సమాజ్‌వాదీ పార్టీ తదితర కూటమి పక్షాల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ గత కొంతకాలంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థగా ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, ఈ అంశంపై ప్రజాస్వామ్య పరిరక్షణ వారంలో భాగంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి కరీంనగర్‌ కలెక్టరేట్‌ వరకు భారీ మార్చ్‌ నిర్వహించనున్నట్లు సత్యం వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు తేజదీప్‌రెడ్డి, సీపీఐ ఎంఎల్‌ (మాస్‌లైన్‌) జిల్లా కార్యదర్శి జిన్నం ప్రసాద్‌, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు పైడిపల్లి రాజు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్‌, కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి, ముత్యం శంకర్‌, ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు శ్రావణ్‌నాయక్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హేమంత్‌, సీపీఐ నగర నాయకుడు అంజన్న తదితరులు పాల్గొన్నారు.