BREAKING
వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక

 సూర్య కరీంనగర్: క్రీడలు విద్యార్థుల్లో ఆసక్తి, ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్‌రెడ్డి అన్నారు. కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్‌ 29న కరీంనగర్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ జోనల్‌ పోటీల్లో అండర్‌-14 బాలుర విభాగంలో డి. శివన్‌రెడ్డి, ఏ. రితిక్‌ పటేల్, వీ. రేవంత్‌రెడ్డి, అండర్‌-14 బాలికల విభాగంలో జోయా, ఏ. నైకా రెడ్డి, వీ. లక్ష్మీ ప్రసన్న, అండర్‌-17 బాలుర విభాగంలో సిహెచ్. జయంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర పోటీలు రంగారెడ్డి, బాలికల పోటీలు కామారెడ్డి, అండర్‌-17 పోటీలు జోగులాంబ గద్వాల్‌లో జరగనున్నాయి. ఎంపికైన విద్యార్థులను డా. నరేందర్‌రెడ్డి అభినందించి, జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.