BREAKING
కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్.. కోలుకుంటున్న వైనంపై ఎమోషనల్ వీడియో వైరల్ ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి - డిప్యూటీ కమిషనర్ చెన్నుడు కుమారుడి జ్ఞాపకార్థం బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం విద్యార్థులకు గాయిటర్ పరీక్షలు

సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం

Select Suryaa Now
సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం

పామూరు, మేజర్ న్యూస్ :  

సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పామూరు ఆర్‌అండ్‌బీ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ  డీఈ డి. వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా సేతు అభియాన్ కార్యక్రమంలో మాజీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండిశెట్టి వెంకటరమణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్లు మున్సిపాలిటీలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా సౌర విద్యుత్ ప్లాంట్లను అందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ మూడు కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.78 వేల సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. మిగిలిన రూ.1,22,000లను 6 శాతం వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రజలు అధిక మొత్తంలో విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకుని డబ్బును ఆదా చేసుకునే అవకాశం కలుగుతుందని కొండిశెట్టి వెంకటరమణయ్య తెలిపారు. కార్యక్రమంలో ఏఈ షేక్ . జిలాని, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పరపు వెంకట సుబ్బారావు, పోశం సూర్యచంద్రరావు, బొంతల అజరత్ కుమార్, తెలుగుదేశం నాయకులు, మాజీ సర్పంచ్ సోమిశెట్టి వెంకటనారాయణ, పత్తు మస్తాన్, పిడుగు శ్రీనివాసులు, వాయినేని రాఘవ, విద్యుత్ శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు, సారా ప్రాజెక్ట్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.